: బాహుబలి-2 గురించి బాలీవుడ్ లో రూమర్!

'బాహుబలి-2' సినిమా గురించి బాలీవుడ్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో, ఈ సినిమా గురించి బాలీవుడ్ లో ఓ ఆసక్తికర రూమర్ వినిపిస్తోంది. అంతేకాదు, అక్కడి పత్రికలన్నీ ఈ విషయం గురించి రాశాయి. ఆ వార్త ఏమిటంటే... ఈ సినిమాలో ఓ గెస్ట్ రోల్ లో షారుఖ్ ఖాన్ నటించాడనేది. అయితే, ఈ విషయం గురించి అటు షారుఖ్ కాని, ఇటు బాహుబలి టీమ్ కానీ ఒక్క కామెంట్ కూడా చేయలేదు. తన తాజా చిత్రం 'రాయిస్' ప్రోషన్ లో భాగంగా బాహుబలి చిత్రాన్ని షారుఖ్ ఆకాశానికి ఎత్తేశాడు. ఈ నేపథ్యంలోనే ఇలాంటి పుకార్లు వస్తున్నాయనేది కొందరి వాదన. అయితే, ఈ పుకారు నిజమైతే బాగుంటుందని సినీ అభిమానులు భావిస్తున్నారు. 

More Telugu News