: త‌గ్గిన పసిడి, వెండి ధ‌ర‌

బంగారం ధరలు ఈ రోజు కింది చూపులు చూశాయి. కొన్ని రోజులుగా పెరుగుతూ వ‌చ్చిన బంగారం ధ‌ర ఈ రోజు రూ.180 తగ్గి పది గ్రాముల బంగారం ధ‌ర 29,700 రూపాయ‌ల‌కు చేరుకుంది. న‌గ‌ల వ్యాపారుల నుంచి కొనుగోళ్లు త‌గ్గ‌డమే ఇందుకు కార‌ణ‌మ‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. మ‌రోవైపు వెండి కూడా బంగారం రూటులోనే ప‌య‌నించి కేజీ ధ‌ర‌పై రూ.300 వ‌ర‌కు త‌గ్గింది. దీంతో ఈ రోజు కేజీ వెండి ధ‌ర 43,150గా న‌మోదైంది. దేశీయ మార్కెట్లోనే కాకుండా గ్లోబ‌ల్ మార్కెట్‌లోనూ బంగారం ధ‌ర‌లు త‌గ్గాయి. అమెరికా డాల‌ర్‌తో పోలిస్తే ఔన్సు బంగారం ధ‌ర‌పై 0.02 శాతం త‌గ్గిన‌ట్లు విశ్లేష‌కులు పేర్కొన్నారు.

More Telugu News