: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు అందించనున్న కేంద్ర ప్రభుత్వం

కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు ప్ర‌భుత్వం శుభ‌వార్త తెలిపనుంది. దేశంలోని మెట్రో నగరాల్లో నివసించే కేంద్ర ప్ర‌భుత్వ‌ ఉద్యోగుల‌ హెచ్‌ఆర్‌ఏ (హౌస్ రెంట్ అలవెన్స్ )ను 30 శాతం పెంచే ప్ర‌యత్నా‌లు మొద‌లుపెట్టింది. ఉద్యోగుల హెచ్‌ఆర్‌ఏపై 7వ వేతన సంఘం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీకి చేసిన సిఫారసుల మేరకు బేసిక్ వేత‌నంపై 30 శాతం హెచ్‌ఆర్‌ఏ చెల్లించాలని నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. ఈ అంశంపైనే కేంద్ర ఆర్థిక కార్యదర్శి అశోక్ ఆధ్వ‌ర్యంలోని అనుమతులు జారీ చేసే కమిటీ 7వ వేతన సంఘంతో క‌లిసి ఈ విష‌యంపై స‌మీక్ష జ‌రిపింది.

 . 

More Telugu News