: త‌న పాత గుండెను చేతితో ప‌ట్టుకొని మురిసిపోయిన మ‌హిళ‌!

12 ఏళ్లుగా గుండె జబ్బుతో బాధపడుతున్న అమెరికాలోని న్యూజెర్సీకి చెందిన 48ఏళ్ల లీసా సల్బర్గ్ అనే ఓ మ‌హిళ‌కు ఇటీవ‌లే వైద్యులు ట్రాన్స్‌ప్లాంటేషన్‌ ద్వారా  మరో గుండెను అమర్చారు. అనంత‌రం ఆమె పాత గుండెను తీసి ఆమె చేతిలో పెట్టారు. దాన్ని మురిపెంగా చూసుకుని ఆ మ‌హిళ స్మైల్ ఇచ్చింది. ఈ శ‌స్త్ర‌చికిత్స గురించి డాక్ట‌ర్లు మాట్లాడుతూ.. ఆ మ‌హిళలో గుండె కండరాలు మందంగా, బిగుతుగా తయారవడంతో రక్త ప్రసరణ వ్యవస్థ దెబ్బతిందని తెలిపారు. దీంతో ఆమెకు గుండె మార్పిడి చేశామ‌ని చెప్పారు. అయితే, త‌న‌ గుండెకు గాట్లు పడకుండా భద్రంగా బయటకు తీయాలని ఆమె చెప్పింద‌ని, అనంత‌రం దాన్ని పడేయకుండా తన చేతులతో పట్టుకునే అవకాశం కల్పించాలని కోరింద‌ని వైద్యులు చెప్పారు. ఆమె స్పృహలోకి రాగానే ఓ కవర్‌లో భద్రంగా ఉంచిన హృదయాన్ని ఆమె చేతిలో పెట్టామ‌ని తెలిపారు.

More Telugu News