: అక్బరుద్దీన్ తో అమిత్ షా రహస్య ఒప్పందం... రూ. 400 కోట్లు తీసుకున్న ఎంఐఎం అధినేత: కాంగ్రెస్ తీవ్ర ఆరోపణ

ఉత్తరప్రదేశ్ లో జరుగుతున్న ఎన్నికల్లో భాగంగా ముస్లింలను రెచ్చగొట్టి వారి ఓట్లను చీల్చేందుకు ఎంఐఎంతో బీజేపీ కుమ్మక్కయిందని, అమిత్ షా రహస్యంగా అక్బరుద్దీన్ తో కలసి ఈ డీల్ కుదుర్చుకున్నారని తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జ్ దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు. బీహార్ లో అర్ధరాత్రి పూట ఈ డీల్ జరిగిందని, రూ. 400 కోట్ల ముడుపులను అక్బరుద్దీన్ పుచ్చుకున్నారని అన్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ తలపెట్టిన జన ఆవేదన సమ్మేళన్ తొలి సభ నిజామాబాద్ లో జరుగగా, దిగ్విజయ్ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇవ్వగా, లాభపడింది మాత్రం టీఆర్ఎస్ అని ఆయన విమర్శించారు. నోట్ల రద్దును తొలుత వ్యతిరేకించిన కేసీఆర్, మోదీతో సమావేశమై మాట్లాడుకుని వచ్చి, ఆపై సమర్థిస్తూ మాట్లాడారని దిగ్విజయ్ ఆరోపించారు. కాగా, నేడు పరిగిలో సాయంత్రం 4 గంటలకు జన ఆవేదన సదస్సు జరగనుంది.

More Telugu News