: మిగతా ఖైదీలతో కలసి ప్లేట్ పట్టుకుని క్యూలో నిలుచున్న శశికళ!

తొలి రెండు రోజులూ జైల్లో ఎవరితోనూ పెద్దగా మాట్లాడకుండా, ముభావంగా ఉన్న అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ, ఆపై సాధారణంగానే వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. మిగతా ఖైదీలతో సమానంగా క్యూలో నిలబడి టిఫిన్, భోజనం చేసినట్టు జైలు వర్గాలు వెల్లడించాయి. ఇక శశికళ, ఇళవరసిలతో పాటు అదే గదిలో కాబోయే భర్తను ప్రియుడితో కలసి హత్య చేసిన శుభ, పక్క గదిలో సైనైడ్ తో ఏడుగురిని హత్య చేసి వారి ఆభరణాలను దోచుకెళ్లిన మల్లిక ఉన్నారన్న సంగతి తెలిసిందే.

దీంతో ఆమె భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్న అన్నాడీఎంకే వర్గాలు, ప్రత్యేక ఖైదీ హోదాను ఆమెకు ఇప్పించడం లేదా తమిళనాడులోని ఏదైనా ఓ జైలుకు తరలించడం చేయాలని గట్టి పట్టుదలతో ఉన్నాయి. కాగా, జైలు నుంచే తన రాజకీయ వ్యూహాలను శశికళ అమలు చేసినట్టు తెలుస్తోంది. కొన్ని ప్రత్యేక మార్గాల ద్వారా, నిన్న అసెంబ్లీలో జరిగిన ఘటనల గురించి తెలుసుకుంటున్న ఆమె, ఎప్పటికప్పుడు సలహా, సూచనలు అందించినట్టు తెలుస్తోంది.

More Telugu News