: కర్ణాటక ఖాతాలోకి జయలలిత కేసుల ఖర్చు.. రూ.5 కోట్లుగా లెక్క తేల్చిన అధికారులు

దివంగత ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసులో కర్ణాటక ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.5 కోట్లు ఖర్చు చేసినట్టు లెక్క తేల్చింది. ఈ మొత్తం సొమ్మును జయ బృందం నుంచి స్వాధీనం చేసుకున్న ఆస్తులను వేలం వేయడం ద్వారా రాబట్టుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. జయ అక్రమాస్తుల కేసులో విచారణ 2014లో ముగిసింది. జయ అక్రమాస్తుల కేసు విచారణను కర్ణాటకకు బదిలీ చేస్తూ నవంబరు 18, 2003న సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. దీంతో కేసు విచారణ కోసం కర్ణాటక ప్రభుత్వం బెంగళూరులో ప్రత్యేక కోర్టు, కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. పదేళ్లపాటు జరిగిన ఈ కేసు విచారణలో మొత్తం రూ.2.86 కోట్లు ఖర్చు అయినట్టు తేలింది.  ఇక కోర్టు, కార్యాలయం, టెలిఫోన్ బిల్లులు, అధికారులు, సిబ్బంది వేతనాలు, పత్రాల అనువాదం, జిరాక్స్.. ఇలా ఇతర ఖర్చులన్నీ కలిపి మొత్తం 5 కోట్ల రూపాయలుగా తేల్చారు. ముఖ్యంగా జయలలిత, శశికళ తదితరుల భద్రతకే ఎక్కువ ఖర్చు చేసినట్టు సమాచారం.

More Telugu News