: అమరావతిలో 9 నగరాలకు భూముల కేటాయింపు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో 9 నగరాలకు రాష్ట్ర ప్రభుత్వం భూములు కేటాయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అందులో పర్యాటక నగరానికి 11,574 ఎకరాలు, నాలెడ్జ్ సిటీకి 8,547 ఎకరాలు, ఎలక్ట్రానిక్స్ నగరానికి 6,582 ఎకరాలు, హెల్త్ సిటీకి 6,511 ఎకరాలు, ఆర్థిక నగరానికి 5,168 ఎకరాలు, మీడియా నగరానికి 5,107 ఎకరాలు, క్రీడల నగరానికి 4,150 ఎకరాలు, న్యాయ నగరానికి 3,438 ఎకరాలు, పరిపాలన నగరానికి 2,702 ఎకరాల చొప్పున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేటాయించింది. ఇందుకు సంబంధించిన డిజైన్లను నార్మన్ అండ్ పార్టనర్స్ సంస్థ ఈ నెల 22న ప్రభుత్వానికి అందజేయనుంది. భూములు కేటాయించిన ఆయా నగరాల్లో ఆయా రంగాల కార్యాలయాలు, ఉద్యోగుల నివాసాలు ఏర్పాటు చేయనున్నారు.

More Telugu News