: అమెరికా యూనివర్శిటీపై మండిపడుతున్న చైనా విద్యార్థులు!

అమెరికాలోని కాలిఫోర్నియా శాన్ డియాగో యూనివర్శిటీపై అక్కడే చదువుతున్న చైనా విద్యార్థులు ఆగ్రహంతో ఉన్నారు. బౌద్ధ గురువు దలైలామాను ఆ యూనివర్శిటీ ఆహ్వానించడమే దీనికి కారణం. ఈ ఏడాది ప్రారంభ కార్యక్రమంలో 'ప్రపంచ బాధ్యత-సేవ-మానవత్వం' అనే అంశంపై దలైలామా ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో ఆ యూనివర్శిటీలోని చైనా విద్యార్థులు, స్కాలర్ల అసోసియేషన్, ఇతర గ్రూపులు దలైలామా రాకను నిరసిస్తున్నాయి. తమ మాతృభూమిని ముక్కలు చేసేందుకు, జాతి సమైక్యతను దెబ్బతీసేందుకు దలైలామా ప్రయత్నిస్తున్నారని మండిపడ్డాయి. అయితే, దలైలామా ఆహ్వానాన్ని రద్దు చేసే ప్రసక్తే లేదని యూనివర్శిటీ యాజమాన్యం తేల్చి చెప్పింది. 

More Telugu News