: పళనిస్వామికి వ్యతిరేకంగానే ఓటేస్తామంటున్న కాంగ్రెస్

తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి కాసేపట్లో ఆ రాష్ట్ర‌ అసెంబ్లీలో బ‌ల నిరూప‌ణ ప‌రీక్ష ఎదుర్కుంటున్న విష‌యం తెలిసిందే. ఆ రాష్ట్ర ప్ర‌తిప‌క్ష పార్టీ డీఎంకే తాము బ‌ల‌నిరూప‌ణ ప‌రీక్ష‌కు హాజ‌రై పళనిస్వామికి వ్యతిరేకంగా ఓట్లు వేస్తామ‌ని నిన్న‌ ప్ర‌క‌టించింది. 8 మంది ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ పార్టీ మాత్రం త‌మ నిర్ణ‌యాన్ని ఈ రోజు ప్ర‌క‌టించింది. తాము ప‌ళ‌నిస్వామికి వ్యతిరేకంగా ఓటు వేస్తామ‌ని చెప్పింది. త‌మ‌కు హైక‌మాండ్ నుంచి ఈ విధంగా ఈ రోజే ఆదేశాలు వ‌చ్చాయ‌ని అన్నారు. డీఎంకే స‌భ్యులు 88 మంది ప‌ళ‌నిస్వామికి వ్యతిరేకంగా ఓటువేయ‌నుండ‌డంతో కాంగ్రెస్ స‌భ్యులు, పన్నీర్ వర్గం, ఇతరులు క‌లిసి ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా ఓటు వేసే వారి సంఖ్య 108గా ఉంది. ప‌న్నీర్ గూటికి ఈ రోజు మ‌రో ఎమ్మెల్యే చేర‌డంతో ఆయ‌న‌కు 12 మంది ఎమ్మెల్యేల మ‌ద్ద‌తు ల‌భించిన విష‌యం తెలిసిందే. మ‌రోవైపు ముస్లింలీగ్ త‌న కూడా త‌మ 1 ఓటును ప‌ళ‌నిస్వామికి వ్య‌తిరేకంగా వేస్తామ‌ని తెలిపింది.

More Telugu News