: తమిళనాడు అసెంబ్లీలో ఓటింగ్ ఎలా జరగబోతోంది?

కాసేపట్లో తమిళనాడు అసెంబ్లీలో పళనిస్వామి తన బలాన్ని నిరూపించుకోబోతున్నారు. ఈ ప్రక్రియలో కేవలం 10 ఓట్లు మాత్రమే అత్యంత కీలకం కానున్నాయి. బల నిరూపణకు మేజిక్ ఫిగర్ 117. అన్నాడీఎంకే శిబిరంలో 123 మంది ఎమ్మెల్యేలు ఉండగా, పన్నీర్ సెల్వం వర్గంలో 12 మంది ఉన్నారు. డీఎంకేకు 89 మంది, కాంగ్రెస్ కు 8 మంది, ముస్లింలీగ్ కు 1, ఆంగ్లో ఇండియన్ కేటగిరీలో ఒక ఎమ్మెల్యే ఉన్నారు.

బల నిరూపణ సందర్భంగా ఓటింగ్ ఈ విధంగా జరిగే అవకాశం ఉంది. తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 6 డివిజన్లు ఉన్నాయి. ఈ క్రమంలో, డివిజన్ల వారీగా ఎమ్మెల్యేలను అసెంబ్లీ కార్యదర్శి లెక్కించనున్నారు. 6 డివిజన్ల ఓటింగ్ ప్రక్రియ అనంతరం తుది ఫలితాన్ని అసెంబ్లీ స్పీకర్ వెల్లడిస్తారు. అయితే, రహస్య ఓటింగ్ ను నిర్వహించాలంటూ స్పీకర్ ను మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం కోరారు. 

More Telugu News