: వ్యూహం మార్చిన పళనిస్వామి... శనివారమే బలనిరూపణ!

తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి వ్యూహం మార్చారు. శనివారం ఆయన అసెంబ్లీలో బలపరీక్ష చేయనున్నట్టు తెలుస్తోంది. ప్రత్యర్థుల ఎత్తుగడలు పసిగట్టిన ఆయన, ఆలస్యం అమృతం  విషం అని భావించి, బలనిరూపణ వీలైనంత తొందరగా పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఆలస్యం చేస్తే ఎమ్మెల్యేలు చేజారిపోయే ప్రమాదం ఉందని, అందువల్ల ఈ నెల 18న అంటే శనివారం బలనిరూపణ చేసేందుకు వీలుగా అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయనున్నారు.

కాగా, ఈ నెల 7న పన్నీర్ సెల్వంతో ముఖ్యమంత్రి పదవికి పార్టీ తాత్కాలిక చీఫ్ సెక్రటరీ శశికళ రాజీనామా చేయించిన అనంతరం ఆయన శశికళ సమాధి చెంత మౌనదీక్ష చేసి, తిరుగుబావుటా ఎగురవేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎత్తుకు పైఎత్తులతో రిసార్ట్ రాజకీయాలకు శశికళ తెరలేపింది. మన్నార్ గుడి మాఫియా అండతో ఆమె సీఎం అయ్యేందుకు పావులు కదిపింది. సుప్రీంకోర్టు తీర్పుతో దోషిగా మారి బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో సాధారణ ఖైదీగా శిక్ష అనుభవిస్తోంది. ఈ నేపథ్యంలో రేపు పళనిస్వామి శశికళతో సమావేశమై, ఎల్లుండి శాసనసభలో బలనిరూపణ చేయనున్నారు. 

More Telugu News