: ఇస్రో విజయం చాలా చిన్నది: అక్కసు వెళ్లగక్కిన చైనా ప్రభుత్వ పత్రిక

104 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపి ఇస్రో అద్భుతాన్ని నెలకొల్పిన వేళ...ప్రపంచం మొత్తం ఇస్రోకు సలాం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాత పత్రికలు భారత్ సాధించిన ఘనతను ప్రధాన వార్తగా ప్రచురించాయి. అయితే భారత్ కు పక్కలో బల్లెంలా ఉన్న చైనా మాత్రం భారత్ సాధించిన ఘనతను అంగీకరించలేకపోతోంది. దీంతో భారత్ సాధించిన ఘనతను తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేసింది.

చైనా ప్రభుత్వ పత్రిక గ్లోబల్ టైమ్స్.. 'ఇస్రో సాధించిన విజయం చాలా చిన్న'దని తెలిపింది. 104 ఉపగ్రహాలతో రికార్డు నెలకొల్పిన భారతీయులు గొప్పగా ఫీలయ్యేందుకు కారణం దొరికిందని కథనం ప్రచురించింది. ఇస్రో ప్రయోగం తక్కువ ఖర్చుతో అంతరిక్షంలో ఎలా విజయం సాధించవచ్చో తెలియజేస్తుందని అభిప్రాయపడింది. స్పేస్ టెక్నాలజీ రేస్ అంటే వందల సంఖ్యలో ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపడం మాత్రమే కాదని తెలిపింది. మంగళ్యాన్ విజయవంతమైన సందర్భంగా కూడా దానిని జీర్ణించుకోలేని చైనా పత్రికలు...అది చాలా చిన్న ప్రయోగమని, భారత్ లో నిరుపేదలు, చదువురానివారు ఉన్నారంటూ కథనాలు ప్రచురించాయి. 

More Telugu News