: మోదీజీ...మీరు ఇప్పుడే ఆ పని చేయచ్చుగా!: రాహుల్ గాంధీ సూచన

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీలన్నీ మాటల తూటాలతో దూసుకుపోతున్నారు. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీకి రాహుల్ ఊహించని సూచన చేశారు. యూపీలో అధికారం ఇస్తే రైతు రుణాలు మాఫీ చేస్తామని తాజాగా ప్రధాని మోదీ తమ ఎన్నికల ప్రచార సభలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దీనిపై రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ఉత్తరప్రదేశ్ లో రైతు రుణాలు మాఫీ చేసేందుకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదన్న సంగతి ప్రధాని గుర్తించాలని అన్నారు.

రైతులపై నిజంగా ప్రేమ ఉంటే దేశ ప్రధానిగా వారి రుణాలు ఇప్పుడే మాఫీ చేసి చూపించాలని ఆయన డిమాండ్ చేశారు. అధికారం కోసం ప్రధాని చాలా హామీలు ఇస్తారని ఆయన చెప్పారు. గతంలో బీహార్ లో కూడా అలాంటి హామీలు చాలా ఇచ్చారని ఆయన గుర్తుచేశారు. తమ కూటమి అధికారంలోకి వస్తే ఉత్తరప్రదేశ్ వ్యాప్తంగా కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. యువతకు ఉచితంగా ఉత్తమ కోచింగ్ అందిస్తామని ఆయన తెలిపారు. తమ కూటమిని గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు. 

More Telugu News