: జైల్లో ‘చిన్నమ్మ’ కొవ్వొత్తులు తయారు చేస్తారట!

కొన్ని దశాబ్దాల పాటు జయలలితతో పాటు పోయెస్ గార్డెన్ లో లగ్జరీ జీవితం గడిపిన అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ ఇకపై జైలులో కొవ్వొత్తులు చేయనున్నారు. అక్రమాస్తుల కేసులో బెంగళూరులోని పరప్పాణ అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న ఆమెకు మూడున్నరేళ్ల పాటు లగ్జరీ జీవితం దూరమైంది. సాధారణ ఖైదీలా జీవితం గడపనున్న శశికళ, కొవ్వొత్తులు లేదా అగర్ బత్తీలు తయారు చేసేందుకు మక్కువ చూపుతున్నారట. ఇందుకుగాను, రోజుకు రూ. 70 లేదా రూ.50 చెల్లిస్తారని సమాచారం.

కాగా, జైలులో సాధారణ ఖైదీలా ఆమె జీవించాల్సిందే తప్పా, ఎటువంటి సౌకర్యాలు కల్పించమని కోర్టు తేల్చిచెప్పిన విషయం తెలిసిందే. అయితే, జైలుకు తరలించేముందు శశికళ తన భర్త నటరాజన్, ఇతర బంధువులతో కొంచెం సేపు మాట్లాడి, కన్నీటిపర్యంతమైంది. ఈ కేసులో శిక్ష పడ్డ శశికళ వదిన ఇళవరసి కూడా తన పిల్లలతో మాట్లాడారు.

More Telugu News