: మీడియాపై మరోసారి విరుచుకుపడ్డ డొనాల్డ్ ట్రంప్!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీడియాపై మ‌రోసారి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అమెరికా భద్రత సలహాదారుడు మైఖెల్‌ ఫ్లిన్‌ రాజీనామా చేయడంపై మీడియాలో వ‌చ్చిన క‌థ‌నాల‌పై ఆయ‌న మండిపడ్డారు. మీడియాలో మొత్తం అవాస్త‌వాలు చూపించార‌ని, అలాంటి వార్త‌ల లీకులివ్వడం కూడా చ‌ట్ట‌విరుద్ధ‌మ‌ని అన్నారు. అలాగే ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహుతో కలసి మాట్లాడుతూ మీడియా ఫ్లిన్‌ను చాలా చెత్తగా ట్రీట్‌ చేసిందని ఆయన వ్యాఖ్యానించారు. త‌మ‌ నిర్ణయాన్ని అన్ని మీడియా సంస్థ‌లు ప్ర‌తికూలంగానే రాశాయ‌ని అన్నారు.

రష్యాతో సంబంధాలు నెరుపుతున్నారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో తనపై విశ్వాసం కోల్పోయారనే భావనతోనే త‌మ దేశ‌ భద్రత సలహాదారుడు మైఖెల్‌ ఫ్లిన్ రాజీనామా చేశార‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా ఫ్లిన్‌పై ట్రంప్ ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. మీడియా మాత్రం అతని పట్ల అన్‌ఫెయిర్‌గా వార్తలు ప్ర‌సారం చేసింద‌ని అన్నారు. తమ ప్రత్య‌ర్థి డెమొక్రాట్లు పెద్ద మొత్తంలో త‌న చేతిలో దెబ్బతిన్న అనంత‌రం ఆ విషయం ప్రజల్లో కవర్‌ చేసుకునేందుకు ఫ్లిన్‌ రాజీనామా విషయాన్ని వారికి సానుకూలంగా ఉప‌యోగించుకుంటున్నార‌ని ఆయ‌న అన్నారు.

More Telugu News