: మరో రికార్డు సాధించిన రిలయన్స్ జియో

ఉచిత మంత్రంతో టెలికాం రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన రిల‌య‌న్స్ జియో సంచ‌లనాలు న‌మోదు చేస్తూ దూసుకువెళుతోంది. ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా వినియోగదారుల‌ను సొంతం చేసుకుంటూ త‌న‌కు తిరుగులేద‌ని నిరూపించుకుంటోంది. 10 కోట్ల మంది వినియోగ‌దారుల‌ను టార్గెట్ పెట్టుకున్న జియో ఆ ల‌క్ష్యాన్ని దాటేసిందని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ తెలిపారు. ఏకంగా 100 మిలియన్ కస్టమర్లను జియో సొంతం చేసుకోవ‌డంతో అంబానీ సైతం ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు. ఈ టార్గెట్‌ను తాము నెలల వ్యవధిలోనే చేరుకుంటామని అంచనా వేయలేదని ఆయ‌న తెలిపారు. ఆధార్ ఆధారిత సిమ్ కార్డుల‌ను అందించ‌డం త‌మ‌కు ప్ల‌స్ పాయింట్ అయింద‌ని ఆయ‌న అన్నారు.

జియో సిమ్‌ కస్టమర్లందరికీ 2016 సెప్టెంబర్ 5 నుంచి ఉచిత సేవలను అందుబాటులోకి తెచ్చిన విష‌యం తెలిసిందే. అప్ప‌ట్లో కేవలం 83 రోజుల్లోనే జియో 50 మిలియన్ కస్టమర్లను చేరుకుని రికార్డు నెలకొల్పింది. ఉచిత కాల్స్‌, డేటా సేవ‌ల‌ను అందిస్తోన్న జియోకు 4జీ వినియోగ‌దారులంద‌రూ జై కొడుతున్నారు. రోజు రోజుకీ జియో కస్టమర్ల సంఖ్య పెరిగిపోతూ వస్తోంది. 

More Telugu News