: ఇస్రోకు కాసుల పంట.. రెండు దశాబ్దాల్లో రూ.4 వేల కోట్ల ఆర్జన

అంతరిక్ష ప్రయోగాల్లో చారిత్రక విజయాలతో దూసుకుపోతున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) కు కాసుల వర్షం కురుస్తోంది. ప్రయోగాల్లోనే కాదు ఆదాయ ఆర్జనలోనూ తనకు తిరుగులేదని నిరూపిస్తోంది. విదేశీ ఉపగ్రహాలను నింగిలోకి పంపడం ద్వారా ఈ ఏడాది రూ. 1,790 కోట్లు ఆర్జించిన ఇస్రో, గత 23 ఏళ్లలో ఏకంగా 4,408 కోట్ల రాబడి పొందింది. ఇస్రో తన వాణిజ్య వ్యహారాల కోసం ప్రత్యేకంగా 1992లో యాంత్రిక్స్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసింది.

నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని ‘షార్’ నుంచి ఇప్పటి వరకు 22 దేశాలకు చెందిన 180 విదేశీ ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టింది. మే 26, 1999లో తొలిసారి పీఎస్ఎల్వీ ద్వారా జర్మనీ, రిపబ్లిక్ కొరియాకు చెందిన రెండు ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టారు. ఇలా ఇప్పటి వరకు 60 ప్రయోగాల ద్వారా 225 ఉపగ్రహాలను నింగిలోకి పంపారు. ఇలా గత 23 ఏళ్లలో ఏకంగా రూ.4,408 కోట్లను ఇస్రో ఆర్జించింది. అంతరిక్ష ప్రయోగాలకు పెట్టే ప్రతి రూపాయిపై రెండు రూపాయల రాబడి వస్తున్నట్టు ఇస్రో సీనియర్ శాస్త్రవేత్త ఒకరు తెలిపారు.

More Telugu News