: స్టూడెంట్ ఫ్రెండ్లీ సిటీల జాబితాలో తొలిసారి భారత నగరాలు

ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులకు స్నేహపూర్వకంగా ఉండే నగరాల జాబితా విడుదల కాగా, ముంబై, ఢిల్లీ నగరాలు తొలిసారి స్థానం దక్కించుకున్నాయి. 'కాక్వరెల్లీ సైమండ్స్' సంస్థ 'క్యూఎస్ బెస్ట్ స్టూడెంట్స్ సిటీస్' ర్యాంకులను ప్రకటించగా, ముంబై 85, ఢిల్లీ 86 స్థానాల్లో నిలిచాయి. గత సంవత్సరం 75 నగరాలకు ర్యాంకులిచ్చిన సంస్థ ఈ సంవత్సరం 100 ర్యాంకులను ప్రకటించింది. సౌకర్యవంతమైన నివాసం, అవకాశాలు, విభిన్న ప్రాంతాల విద్యార్థులు, వారికి వస్తున్న ర్యాంకులు, ఉద్యోగావకాశాలు తదితరాలను పరిశీలించి ఈ ర్యాంకులను ప్రకటించినట్టు క్యూఎస్ తెలిపింది.

కాగా, ఈ జాబితాలో తొలి స్థానంలో కెనడాకు చెందిన మాంట్రియల్ నిలువగా, రెండో స్థానాన్ని ప్యారిస్ నగరం దక్కించుకుంది. ఆపై లండన్, సియోల్, మెల్ బోర్న్, బెర్లిన్, టోక్యో, బోస్టన్, మ్యూనిచ్, వాంకోవర్ లు టాప్-10లో నిలిచాయి. కాలుష్యం, లంచగొండితనం, రక్షణ సహా 'క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్' లో ముంబై 90వ ర్యాంకులో, న్యూఢిల్లీ 91వ ర్యాంకులో నిలిచాయి.

More Telugu News