: గవర్నర్ చేతిలో తమిళనాడు భవితవ్యం...సర్వత్ర ఉత్కంఠ

తమిళనాడు ముఖ్యమంత్రిపై గత కొంత కాలంగా నెలకొన్న ఉత్కంఠ ముగింపు దశకు వచ్చింది. రాష్ట్ర భవిష్యత్ ముఖ్యమంత్రి ఎంపిక గవర్నర్ సీహెచ్ విద్యాసాగరరావు చేతిలో ఉంది. రాజ్ భవన్ ఆదేశాల మేరకు నేటి సాయంత్రం 7:30 నిమిషాలకు అన్నాడీఎంకే కొత్త శాసనసభాపక్ష నేత పళనిస్వామి గవర్నర్ ను కలిశారు. గతంలో ఆయనకు అందజేసిన జాబితాను మరోసారి అందజేసి, తమకు పూర్తి మెజారిటీ ఉందని, ఎమ్మెల్యేలంతా తనకు మద్దతు పలుకుతున్నారని, తమకు అవకాశం ఇవ్వాలని కోరారు.

 అనంతరం పన్నీర్ సెల్వం గవర్నర్ తో సమావేశమై ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా బలనిరూపణలో తొలి అవకాశం తనకు ఇవ్వాలని విన్నవించుకున్నారు. ఈ నేపథ్యంలో గవర్నర్ నిర్ణయమే తమిళనాడులో ముఖ్యమంత్రిని ఎంపిక చేయనుంది. ఈ క్రమంలో ఆయన న్యాయనిపుణుల సలహాలు తీసుకున్నారు. రాష్ట్ర భవిష్యత్ కు నష్టం కలగని రీతిలో నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. దీంతో ఆయన ఏం చెబుతారా? అన్న ఉత్కంఠ సర్వత్ర నెలకొంది. 

More Telugu News