: జైలులో శశికళ రాత్రి భోజనం మెనూ ఇదే...!

బెంగళూరులోని పరప్పణ అగ్రహార జైలులో తమిళనాడు అన్నాడీఎంకే తాత్కాలిక సెక్రటరీ శశికళా నటరాజన్ జైలు జీవితం ప్రారంభమైంది. ప్రత్యేకకోర్టులో లొంగిపోయిన శశికళను కోర్టు ఆదేశాలతో జైలు అధికారులు అదుపులోకి తీసుకుని, వైద్యపరీక్షలు నిర్వహించి జైలుకు తీసుకెళ్లారు. అనంతరం ఖైదీలందరికీ అందజేసే ఖద్దరు చీరను ఆమెకు ఇచ్చారు. ఖైదీ నెంబర్ 9234 ను ఆమెకు కేటాయించారు. ఇద్దరు ఖైదీలతో కలిసి ఉండే బ్యారక్ లో ఆమెకు గదిని కేటాయించారు. అనంతరం అందరు ఖైదీల్లా ఆమెకు ఆహారం అందించారు. ఇకపై ఆమె ప్రతిరోజూ ఇదే ఆహారం స్వీకరించనున్నారు. రాత్రి భోజనంగా ఆమెకు రెండు చపాతీలు, 200 గ్రాముల అన్నం లేదా రాగిముద్ద, 150 మిల్లీలీటర్ల సాంబారు ఇచ్చారు. అలాగే రోజూ 50 రూపాయల వేతనంతో పని చేయాలని సూచించారు. పనిని ఎంచుకునే సౌలభ్యం ఆమెకు కల్పించారు. 

More Telugu News