: నాసాలో పని చేస్తున్న భారతీయ సంతతి శాస్త్రవేత్తకు హ్యూస్టన్ విమానాశ్రయంలో అవమానం!

అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ 'నాసా'లో పనిచేస్తున్న భారతీయ శాస్త్రవేత్త సిద్ బిక్కన్నవార్ (35)కు అవమానం జరిగింది. హ్యూస్టన్ లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. తన ఫోన్ పాస్ వర్డ్ అడిగారని... బలవంతంగా ఫోన్ ను అన్ లాక్ చేయించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తొలుత పాస్ వర్డ్ ఇచ్చేందుకు తాను నిరాకరించానని... ఆ ఫోన్ నాసా ఇచ్చినందున, అందులో ఏముందో చెప్పడం కుదరదని తాను వాదించానని తెలిపారు.

తాను అమెరికాలోనే పుట్టానని... నాసాలో ఇంజినీర్ గా పని చేస్తున్నానని, అమెరికా పాస్ పోర్టు కూడా ఉందని తాను చెప్పినప్పటికీ కస్టమ్స్ అధికారులు తనను వదలలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన ఫోన్ లో ఉన్న డేటాను మొత్తం కాపీ చేసుకున్న తర్వాతనే, తన ఫోన్ ను తిరిగి ఇచ్చేశారని చెప్పారు. సెలవులో ఉన్న తాను వేరే దేశానికి వెళ్లానని... అమెరికా బ్యాన్ చేసిన దేశాలకు కూడా వెళ్లలేదని చెప్పారు. అమెరికాలోనే పుట్టిన బిక్కన్నవార్ స్పేస్ టెలిస్కోపులకు కావాల్సిన టెక్నాలజీని డిజైన్ చేస్తారు.  

More Telugu News