: 'అమ్మ'కిక భారతరత్న లేదు, పార్లమెంటులో విగ్రహం లేదు!

తమిళనాడులో ప్రజారంజక పాలన సాగించి అనూహ్య రీతిలో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చి, ఆపై తీవ్ర అనారోగ్య సమస్యతో మరణించిన జయలలితకు భారత అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటించే అవకాశాలు ఇక లేవు. ఇదే సమయంలో ఆ పార్టీ నేతలు పన్నీర్ సెల్వం తదితరులు కోరినట్టుగా పార్లమెంటులో విగ్రహం, చిత్రపటం ఏర్పాటు చేసే అవకాశాలూ లేవని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 1996 నాటి అక్రమాస్తుల కేసులో, జయలలితతో పాటు నిందితులను దోషులుగా సుప్రీంకోర్టు నిర్థారించిన నేపథ్యంలో, నేర చరితులకు భారతరత్న ఇవ్వరాదన్న నిబంధనలు అన్నాడీఎంకే నేతలు, కార్యకర్తలు, తమిళ ప్రజల ఆకాంక్షను నెరవేరకుండా చేయనుంది. ఇదే నిబంధనలను పార్లమెంట్ కూడా అమలు చేస్తున్నందున ఆమె విగ్రహం ఏర్పాటుకు తావు లేకుండా పోనుందని సమాచారం.

More Telugu News