: రేపు రివ్యూ పిటిషన్ వేయనున్న శశికళ లాయర్లు?

అక్రమాస్తుల కేసులో శశికళ దోషిగా తేలిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు ప్రతి ఇంకా ఆమెకు అందలేదని చిన్నమ్మ వర్గీయులు చెబుతున్నారు. శశికళను అరెస్టు చేసే విషయమై చెన్నై పోలీసులకు కూడా ఇంకా ఎటువంటి ఆదేశాలు రాలేదని తెలుస్తోంది. అయితే, తాను లొంగిపోయేందుకు నాలుగు వారాల గడువు కావాలని శశికళ కోరే అవకాశాలు ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. శశికళ లాయర్లు సుప్రీంకోర్టులో రేపు రివ్యూ పిటిషన్ వేయనున్నారని, తీర్పు ఇచ్చిన డివిజన్ బెంచ్ ముందే ఈ పిటిషన్ వేస్తారని తెలుస్తోంది. కాగా, ప్రస్తుతం గోల్డెన్ బే రిసార్ట్ లో శశికళ ఉండటంతో ఆ ప్రాంతంలో భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. చిన్నమ్మను అదుపులోకి తీసుకుంటున్నారనే ప్రచారంతో అన్నాడీఎంకే కార్యకర్తలు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు.

More Telugu News