: బెంగళూరు పరప్పన జైలు వద్ద భారీ భద్రత... శశి వర్గీయులు నగరంలో ప్రవేశించకుండా నిఘా

శశికళకు సుప్రీంకోర్టు నాలుగేళ్ల జైలు శిక్షను ఖరారు చేసిన నేపథ్యంలో, బెంగళూరులోని పరప్పన అగ్రహార కేంద్ర కారాగారం వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. కర్ణాటక రాష్ట్ర రిజర్వు పోలీసులతో పాటు నగర సాయుధ రిజర్వు సిబ్బంది పరప్పన జైలు వద్ద మోహరించారు. సీనియర్ పోలీసు అధికారులు భద్రతను పర్యవేక్షిస్తున్నారు.

దీనికి తోడు హోసూరు చెక్ పోస్టు వద్ద కూడా భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. శశికళ అనుచరులు బెంగళూరు నగరంలోకి ప్రవేశించకుండా, ముందస్తు చర్యలో భాగంగా ఈ ఏర్పాట్లు చేశారు. 2014 సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో 21 రోజుల పాటు జయలలిత ఈ జైల్లోనే ఉన్నారు. ఆమెతో పాటు శశికళ, సుధాకరన్, ఇళవరసిలు కూడా జైలు శిక్షను అనుభవించారు. 

More Telugu News