: న్యాయ నిపుణుల సలహాలు తీసుకునే పనిలో మునిగిపోయిన శశికళ!

జయలలిత అక్రమాస్తుల కేసులో దోషిగా తేలిన శశికళకు సుప్రీంకోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.10 కోట్ల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బెంగళూరు కోర్టు ముందు శశికళ లొంగిపోవాల్సి ఉంది. అయితే, ఇందుకు, ఆమె విముఖంగా ఉన్నట్లు చిన్నమ్మ వర్గాల ద్వారా తెలుస్తోంది. ప్రత్యామ్నాయంపై న్యాయ నిపుణుల సలహాలు తీసుకునే పనిలో శశికళ ఉన్నారని, తీర్పు ఇచ్చిన బెంచ్ ముందే రివ్యూ పిటిషన్ వేయాలని న్యాయ నిపుణులు సలహా ఇచ్చినట్టు సమాచారం. ఒకవేళ రివ్యూ పిటిషన్ కూడా తిరస్కరణకు గురైతే క్యూరేటివ్ పిటిషన్ వేయాలని కూడా కొందరు న్యాయ నిపుణులు ఆమెకు సూచించినట్టు చెబుతున్నారు.

More Telugu News