: అక్రమాస్తుల కేసులో తీర్పు ఇచ్చిన సుప్రీం న్యాయమూర్తుల వివరాలు!

జయలలిత అక్రమాస్తుల కేసులో శశికళను దోషిగా నిర్ధారిస్తూ సుప్రీంకోర్టు ఈ రోజు తీర్పు వెలువరించింది. ఈ కేసులో న్యాయమూర్తులుగా వ్యవహరించింది జస్టిస్ అమితవ రాయ్, జస్టిస్ పినాకి చంద్రఘోష్. న్యాయమూర్తి పినాకి చంద్రఘోష్ గతంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వర్తించారు. 1952 మే 28న ఆయన జన్మించారు. యూనివర్శిటీ ఆఫ్ కోల్ కతా నుంచి న్యాయవిద్యలో పట్టా పొందారు. కోల్ కతా హైకోర్టు మాజీ చీఫ జస్టిస్ శంభు చంద్ర ఘోష్ కుమారుడే పినాకి చంద్ర ఘోష్. ఇక అస్సాంకు చెందిన అమితవరాయ్, గతంలో ఒడిశా, రాజస్థాన్ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తిగా పని చేశారు. 1953 మార్చి 1న డిబ్రూగఢ్ లో జన్మించారు. న్యాయవాదుల కుటుంబానికి చెందిన ఆయన డిబ్రూగఢ్ యూనివర్శిటీ నుంచి న్యాయవిద్యలో పట్టా పొందారు. 

More Telugu News