: ఆరేళ్లు కాదు... కనీసం తొమ్మిదేళ్లు శశికళ ఎన్నికలకు దూరం

దాదాపు 20 సంవత్సరాల పాటు సాగిన జయలలిత అక్రమాస్తుల కేసు, అనేక మలుపులు తిరిగి, సుప్రీంకోర్టు తీర్పుతో ఓ కొలిక్కి వచ్చింది. ఈ కేసులో తొలి ముద్దాయిగా ఉన్న జయలలిత మరణించడంతో ఆమె పేరును తొలగిస్తారు. ఇక ఏ-2 గా ఉన్న శశికళ, ఏ-3గా ఉన్న ఇళవరసి, ఏ-4గా ఉన్న దినకరన్, సుధాకరన్ లు శిక్ష అనుభవించక తప్పనిసరి పరిస్థితి. వీరంతా నాలుగు సంవత్సరాల పాటు జైలు శిక్షను అనుభవించాల్సి వుంది. ఈ నాలుగేళ్లు, ఆపై మరో ఆరు సంవత్సరాల పాటు వీరంతా ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉండాలి. ఇప్పటికే కొంతకాలం జైల్లో ఉండటం, ఆపై రెమిషన్ వంటివి తీసేస్తే, శశికళ బృందం మూడు సంవత్సరాల పాటు జైల్లో ఉండాల్సి వుంటుంది. ఆపై బయటకు వచ్చిన తరువాత ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం అమలవుతుంది కాబట్టి, మొత్తం 9 సంవత్సరాల పాటు ఆమె ఎన్నికలకు దూరంగా ఉండనున్నారు.

More Telugu News