: తమిళనాడు గవర్నర్ ముందు రెండే రెండు ఆప్షన్లు!

ఆదాయానికి మించి ఆస్తులు క‌లిగి ఉన్న‌ కేసులో నిందితురాలిగా ఉన్న‌ శశికళకు సుప్రీంకోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష విధించిన నేప‌థ్యంలో ఇక అంద‌రి చూపూ గ‌వ‌ర్న‌ర్ తీసుకునే నిర్ణ‌యంపైనే ఉంది. ఇక ఇన్‌ఛార్జ్‌ గ‌వ‌ర్న‌ర్ విద్యాసాగ‌ర్‌రావు సుప్రీంకోర్టు తీర్పు అంశాన్ని సునిశితంగా ప‌రిశీలిస్తున్నారు. ఆయ‌న‌ ముందు రెండే రెండు ఆప్ష‌న్లు ఉన్నాయని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు. అందులో ఒక‌టి ప‌న్నీర్ సెల్వంను బ‌ల నిరూప‌ణ చేసుకోమ‌ని ప్ర‌క‌టించ‌డం. రెండోది అసెంబ్లీ స‌మావేశాలు ఏర్పాటు చేసి స‌భ‌లోనే స‌భా నాయ‌కుడిని ఎన్నుకోమ‌ని సూచించడం. గ‌వ‌ర్న‌ర్ ఈ అంశాల‌పై ఎప్పుడు ప్ర‌క‌ట‌న చేస్తార‌నే విష‌యం గురించి రాజ్‌భ‌వ‌న్ నుంచి ఇంత‌వ‌ర‌కు ప్ర‌క‌ట‌న రాలేదు. మ‌రోవైపు పన్నీర్ సెల్వం ఇంటి వ‌ద్ద పోలీసులు మ‌రింత‌ భ‌ద్ర‌తను పెంచారు.

More Telugu News