: సెంగొట్టయ్యనా? పళనిస్వామా?... శశికళ ఎవరి పేరు చెప్పినా, అవతలి వర్గం జంపే!

తనకిక ముఖ్యమంత్రిగా పనిచేసే అవకాశం లేదని స్పష్టం కావడంతో, కనీసం పార్టీనైనా తన చెప్పుచేతల్లో ఉంచుకోవాలని భావిస్తున్న శశికళ, శరవేగంగా పావులు కదుపుతున్నారు. తనకు నమ్మకస్తుడైన మరో వ్యక్తిని శాసనసభా పక్ష నేతగా ప్రకటించాలన్న ఉద్దేశంతో ఉన్న ఆమె, సెంగొట్టయ్యన్, పళనిస్వామి పేర్లను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఆమె నోటి వెంట ఎవరి పేరు వచ్చినా, అవతలి వర్గం పన్నీర్ సెల్వం శిబిరంలోకి వెళ్లిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం సెంగొట్టయ్యన్ కు నమ్మకస్తులుగా 25 మంది వరకూ ఎమ్మెల్యేలు, పళనిస్వామికి అనుకూలంగా 22 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్టు తెలుస్తోంది. మరో 70 మంది వరకూ శశికళ ఏరికోరి ఎమ్మెల్యేలుగా టికెట్లు ఇప్పించుకున్న వారే కావడంతో, వారు మాత్రం తుది వరకూ వేచి చూడవచ్చని అంచనా. గోల్డెన్ బే రిసార్టు నుంచి శశికళ బయటకు వచ్చిన కొన్ని గంటల వరకూ ఈ సస్పెన్స్ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

More Telugu News