: శశికళ దోషే... శిక్ష అనుభవించాల్సిందే: సుప్రీం న్యాయమూర్తి పినాకి చంద్రఘోష్ తీర్పు

అనుకున్నట్టుగానే జయలలిత అక్రమాస్తుల కేసులో ఏ-2 ముద్దాయిగా ఉన్న శశికళ దోషేనని సుప్రీంకోర్టు ప్రకటించింది. వారికి శిక్ష విధించాల్సిందేనని అభిప్రాయపడింది. ద్విసభ్య ధర్మాసనంలోని సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్ తీర్పును చదువుతూ, ఈ కేసు తీవ్రమైనదని వ్యాఖ్యానించారు. చట్టాన్ని మీరి ప్రవర్తించినట్టు స్పష్టమవుతోందని అన్నారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులంతా దోషులేనని ఆయన తన తీర్పులో పేర్కొన్నారు. మరో న్యాయమూర్తి అమితవ రాయ్ ఏ నిర్ణయం తీసుకుంటారన్న విషయమై శశికళ భవితవ్యం ఆధారపడి వుంటుంది. తీర్పుపై మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

More Telugu News