: ఇద్దరు అబలలం.. పార్టీని కాపాడుకునేందుకు 33 ఏళ్లు పోరాడాం.. శశికళ భావోద్వేగం

రాజకీయాలు వద్దనుకున్న జయలలితను బలవంతం చేసి ఒప్పించానని, అప్పటి నుంచి పార్టీని కాపాడుకునేందుకు 33 ఏళ్లపాటు ఇద్దరు అబలలం కలిసి పోరాడామని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ అన్నారు. సోమవారం తన నివాసం వద్ద కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన ఆమె భావోద్వేగానికి గురయ్యారు. ఇప్పడు తనపై తిరుగుబాటు చేస్తున్న అందరికీ రాజకీయ జీవితం ప్రసాదించినది జయలలితేనని గుర్తు చేశారు. వారు ఆ కృతజ్ఞతను మరిచి తనపై తిరుగుబాటు చేస్తున్నారని అన్నారు.

డిసెంబరు 5న అర్ధరాత్రి 12 గంటలకు జయ మృతి గురించి తెలిసిందన్నారు. అప్పుడు ఏడుస్తూనే పన్నీర్ సెల్వం, ఐదుగురు మంత్రులను పిలిచానని గుర్తు చేశారు. పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రిగా కొనసాగాలని కోరానని, వెంటనే గవర్నర్ వద్దకు వెళ్లి ప్రమాణ స్వీకారం చేయాలని సూచించానన్నారు. తనకు సర్వస్వం అయిన అక్క చనిపోయిందని, ఆమె కంటే తనకు పదవులు ఎక్కువ కాదని శశికళ పేర్కొన్నారు. తానే కనుక సీఎం కావాలనుకుంటే ఆ క్షణాన్నే అయి ఉండేదాన్నన్నారు. శశికళతో కలిసి 33 ఏళ్లు జీవించానని, ఇప్పుడు ‘అమ్మ’ పార్టీని బతికించుకునేందుకు ముందుకొచ్చానని స్పష్టం చేశారు.

 
 

More Telugu News