: ‘ఆన్ లైన్’ లో ప్రేమికులను వెతుక్కునే వాళ్లూ! జాగ్రత్త!..మూడు దేశాల పోలీసుల హెచ్చరిక

‘వాలెంటైన్స్ డే’ జరుపుకునే వారే కాదు.. దీని పేరిట మోసాలకు పాల్పడే వారు ఉన్నారట. ఈ నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలంటూ ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా పోలీసులు తమ దేశస్థులను హెచ్చరిస్తున్నారు. ‘వాలెంటైన్స్ డే’ నేపథ్యంలో సామాజిక మాధ్యమాల ద్వారా ‘ఆన్ లైన్’ లో ప్రేమికులకు వెతుక్కునే వారు ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా మోసపోక తప్పదని అంటున్నారు. ఈ క్రమంలో మూడు దేశాలు ఏకతాటిపైకి వచ్చి జరిపిన దాడుల్లో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.

ప్రేమ కురిపిస్తూ, మాయమాటలు చెబుతూ ఈ తరహా మోసాలకు పాల్పడే వారిలో నైజీరియన్ల శాతం అధికంగా వుంది. ఈ ముఠాకు చెందిన 27 మందిని తమ అదుపులోకి తీసుకున్నామని, అందులో 11 మంది నైజీరియన్లేనని తెలిపారు. ఈ ముఠాకు చెందిన వారు అవతలి వ్యక్తితో నేరుగా ఫోన్ లో మాట్లాడటం, కలవటం వంటివి చేయరని, కేవలం మెస్సేజ్ లు మాత్రమే పంపి, డబ్బులు గుంజుకుంటుంటారని పోలీసులు పేర్కొన్నారు. వీరి మాయలో పడి మోసపోయిన వారి సంఖ్య 108 వరకు ఉందని, సుమారు 5 మిలియన్ డాలర్లు వరకు వారు సొమ్ము చేసుకున్నారని పేర్కొన్నారు. ఈ తరహా మోసాలకు ఆస్ట్రేలియాలో నలభై సంవత్సరాలకు పైబడిన వారు భారీగా తమ డబ్బును పోగొట్టుకున్నారని ఆ దేశ పోలీసులు చెప్పారు.

More Telugu News