: బంగ్లాపై భారత్ ఘన విజయం!

బంగ్లాదేశ్ తో హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. వరల్డ్ నెంబర్ వన్ జట్టుకు బంగ్లాదేశ్ జట్టు సరైన పోటీనివ్వలేకపోయింది. దీంతో ఉప్పల్ స్టేడియంలో టీమిండియా తన విజయాల రికార్డును మెరుగుపరుచుకుంది. తొలి ఇన్నింగ్స్ లో మురళీ విజయ్ (108), ఛటేశ్వర్ పూజారా (83), కోహ్లీ (204), అజింక్యా రహానే (82), సాహా (106) రాణించడంతో టీమిండియా ఆరు వికెట్ల నష్టానికి 687 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లా జట్టు షకిబల్ హసన్ (82), కెప్టెన్ ముష్ఫికర్ రహీమ్ (127), మెహదీ అల్ హసన్ (51) రాణించడంతో 388 పరుగులకు ఆలౌట్ అయింది.

 అనంతరం భారత జట్టు రెండో ఇన్నింగ్స్ లో పుజారా (54) రాణించడంతో నాలుగు వికెట్ల నష్టానికి 159 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం 459 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లాదేశ్ జట్టును రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలు చెరి నాలుగు వికెట్లు తీసి కుప్పకూల్చారు. వారికి ఇషాంత్ శర్మ రెండు వికెట్లతో జతకలవడంతో బంగ్లాదేశ్ జట్టు 250 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. దీంతో 208 పరుగుల భారీ ఆధిక్యంతో భారత జట్టు విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్ లో డబుల్ సెంచరీ చేసిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచాడు. 

More Telugu News