: ముస్లిం అయివుండి ఇండియా తరఫున ఎందుకు ఆడుతున్నావని ఇర్ఫాన్ పఠాన్ ను ప్రశ్నించిన పాక్ బాలిక... బ్రిలియంట్ రిప్లై!

భారత జట్టులో తిరిగి స్థానం సంపాదించుకోవాలని ప్రయత్నిస్తున్న పేస్ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్, గతంలో తనకు ఎదురైన ఓ అనుభవం గురించి నాగపూర్ లో మీడియాకు వివరించారు. తాను లాహోర్ లో ఉన్న వేళ, ఓ బాలిక తన వద్దకు వచ్చి "ఓ ముస్లిం అయివుండి ఇండియా తరఫున ఎందుకు క్రికెట్ ఆడుతున్నావు?" అని ప్రశ్నించిందని అన్నాడు. ఆపై తాను సమాధానం ఇస్తూ, "ఇండియా తరఫున ఆడటం నాకెంతో గర్వకారణమని చెప్పాను. ఆ ఘటన నాకు ఇప్పటికీ ప్రేరణగా నిలుస్తుంది. నేను గర్వపడే సందర్భాలు ఇంకా ఉన్నాయి. తొలి మ్యాచ్ ఆడేవేళ, కెప్టెన్ సౌరవ్ గంగూలీ, నాకు టోపీని ఇవ్వడం నా జీవితంలో అత్యంత మధురమైన సమయం" అని అన్నాడు. కాగా, ఇండియా తరఫున 29 టెస్టులు, 120 వన్డేలు, 24 టీ-20 మ్యాచ్ లను ఇర్ఫాన్ ఆడిన సంగతి తెలిసిందే.

More Telugu News