: నా ఆరోగ్య రహస్యం అదే!.. వివరించిన దలైలామా

హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో  ‘దలైలామా సెంటర్ ఫర్ ఎథిక్స్ అండ్ ట్రాన్స్‌ఫర్మేటివ్ వాల్యూస్’ దక్షణాసియా కేంద్రానికి దలైలామా ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన ‘నైతికత- విలువలు- నడవడిక’ అనే అంశంపై మాట్లాడారు. పలువురి  సందేహాలను నివృత్తి చేశారు. ప్రపంచమంతా కలిసి ఒకే యూనియన్‌గా ఉండాలనేది తన కల అని ఆయన పేర్కొన్నారు. అమెరికా-మెక్సికో మధ్య గోడ కట్టాలన్న ట్రంప్ నిర్ణయాన్ని ఆయన వ్యతిరేకించారు.

ఈ సందర్భంగా తన ఆరోగ్య రహస్యాన్ని సభికులతో పంచుకున్నారు. తన వయసు 82 ఏళ్లు అని, అయినా తాను 60 ఏళ్ల వ్యక్తిలా కనిపిస్తానని చాలా మంది అంటుంటారని పేర్కొన్నారు. నియమబద్ధమైన జీవనమే తన ఆరోగ్య రహస్యమని వివరించారు. రోజూ సాయంత్రం ఆరు గంటలకే నిద్రపోతానని చెప్పిన దలైలామా తెల్లవారుజామున మూడు గంటలకే నిద్రలేస్తానని తెలిపారు. అంటే రోజుకు 9 గంటలు నిద్రపోతానని పేర్కొన్నారు. ఉదయం నిద్ర లేచాక నాలుగు గంటలపాటు అనలిటికల్ మెడిటేషన్ చేస్తానని వివరించారు. సాయంత్రం మరో గంట పాటు ధ్యానం చేస్తానని, కాస్త సమయం దొరికితే పుస్తకాలు చదువుతానని దలైలామా వివరించారు.  

More Telugu News