: ఈ సదస్సు నిర్వహించాలనే ఆలోచన వచ్చింది అక్కడే: చంద్రబాబు

జాతీయ మహిళా పార్లమెంటేరియన్ సదస్సు నిర్వహించాలనే ఆలోచన పుణె పర్యటనకు వెళ్లినప్పుడు వచ్చిందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతిలో నిర్వహిస్తున్న జాతీయ మహిళా పార్లమెంటేరియన్ ముగింపు సదస్సులో ఆయన మాట్లాడుతూ, అమరావతిలో ఈ సదస్సు నిర్వహించేందుకు స్పీకర్ సుమిత్రా మహాజన్ అంగీకరించారని అన్నారు. ఈ సదస్సు లక్షలాది మందికి స్ఫూర్తి నిచ్చిందని, సమస్యలకు పరిష్కారం దొరుకుతుందనే నమ్మకం కలిగించిన ఈ సదస్సు, ఒక ప్రభంజనం సృష్టించిందని అన్నారు. ఈ తరహా సదస్సు ఒక్కసారితో ఆగిపోకూడదని, ప్రతి ఏటా నిర్వహించాల్సిన అవసరముందని అన్నారు. మహిళలకు పురుషులతో సమాన అవకాశాలు వచ్చే వరకూ వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని చంద్రబాబు పేర్కొన్నారు. 

More Telugu News