: ఆధిక్యమున్నా ఫాలో ఆన్ ఇవ్వని భారత్... రెండో ఇన్నింగ్స్ మొదలు

తొలి ఇన్నింగ్స్ లో 299 పరుగుల ఆధిక్యం లభించినప్పటికీ, బంగ్లాదేశ్ ను ఫాలో ఆన్ ఆడించాలని భారత్ నిర్ణయించుకోలేదు. 388 పరుగులకు బంగ్లాదేశ్ ను ఆలౌట్ చేసిన అనంతరం, భారత్ రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. మురళీ విజయ్, లోకేష్ రాహుల్ లు బ్యాటింగ్ ప్రారంభించారు. బౌలర్లకు విశ్రాంతి ఇవ్వడమే కెప్టెన్ విరాట్ కోహ్లీ వ్యూహంగా తెలుస్తోంది. సాధ్యమైనంత త్వరగా స్కోరును ముందుకు తీసుకెళ్లి, ఆధిక్యాన్ని కనీసం 400 పరుగులు దాటించిన తరువాత, నేటి సాయంత్రం ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేయాలన్నది భారత జట్టు ఆలోచన. ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్ లో భారత్ స్కోరు ఒక ఓవర్లో వికెట్ నష్టపోకుండా ఒక పరుగు కాగా, ఆధిక్యం 300 పరుగులకు చేరింది. ఆపై లంచ్ విరామాన్ని అంపైర్లు ప్రకటించారు.

More Telugu News