: తప్పిన 'గోడ' లెక్క... సరిచేయాలని సూచించిన ట్రంప్!

మెక్సికో నుంచి వలసలను ఆపుతామని హామీ ఇస్తూ, మధ్యలో గోడ కట్టేందుకు వేసిన డొనాల్డ్ ట్రంప్ లెక్క తప్పింది. ఎన్నికల ప్రచార సమయంలో ఈ గోడకు 12 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 80 వేల కోట్లు) ఖర్చవుతుందని అంచనా వేయగా, ఇప్పుడు అదే గోడ నిర్మాణానికి 21.6 బి. డాలర్లు (సుమారు రూ. 1.44 లక్షల కోట్లు) కావాలని అధికారులు తేల్చారు. దీంతో వెనక్కు తగ్గిన ట్రంప్, గోడ కట్టే విషయంలో తాను జోక్యం చేసుకోబోనని, నిర్మాణ వ్యయం మాత్రం సగానికి తగ్గేలా చూడాల్సిందేనని సూచించినట్టు తెలుస్తోంది. ఆర్థిక సమస్యల్లో కూరుకుపోవడం ఇష్టంలేని ట్రంప్, ఈ గోడ అంచనా ఖర్చును తగ్గించాలని భావిస్తున్నట్టు సమాచారం. కాగా, గోడ నిర్మాణానికి మెక్సికో సైతం వాటా ఇవ్వాలని ట్రంప్ కోరగా, అందుకు మెక్సికో ప్రెసిడెంట్ ఎన్రిక్ పెనా నీటో నిరాకరించిన సంగతి తెలిసిందే.

More Telugu News