: సీఎం చంద్రబాబు, ఏపీ డీజీపీపై మండిపడ్డ ఎమ్మెల్యే రోజా!

జాతీయ మహిళా పార్లమెంటేరియన్ సదస్సుకు హాజరయ్యేందుకు వెళ్లిన తనను అదుపులోకి తీసుకోవడంపై ఏపీ డీజీపీ సాంబశివరావుకు ఫిర్యాదు చేస్తే ఆయన మాట్లాడిన మాటలు సిగ్గుచేటుగా ఉన్నాయని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. ఒక మహిళా శాసనసభ్యురాలు మహిళల సమస్యలపై ఈ సదస్సులో మాట్లాడేందుకు కుదరలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

‘వ్యతిరేకంగా మాట్లాడితే రానీయం..పాజిటివ్ గా మాట్లాడితే రానిస్తాం’ అని డీజీపీ సాంబశివరావు చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉందని రోజా విమర్శించారు. ఈ రోజు ఉదయం జరిగిన ఈ సంఘటనపై మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ‘ఈ సదస్సులో పాల్గొనేందుకు రమ్మని మాకు ఇన్విటేషన్లు పంపించారు. మీకు హోటళ్లు, సీట్లు రిజర్వ్ చేశామని చెప్పి.. నన్ను ఎయిర్ పోర్టులో అరెస్ట్ చేశారే! నా దగ్గర బాంబులు దొరికాయా? గన్నులు దొరికియా? కత్తులు దొరికాయా? ఏం దొరికాయి? ఒకవేళ ఏదో చేసేస్తాననే భయం ఉంటే, నాకు ఇన్విటేషన్ ఎందుకు పంపారు? ఒకటి కాదు, రెండు ఇన్విటేషన్లు పంపారు. ఒకటి హైదరాబాద్ మణికొండలో నా ఇంటికి, రెండోది నగరిలోని ఇంటికి పంపించారు.

మరి, నేను రావడం ఇష్టం లేకపోతే, ఎందుకు ఇన్విటేషన్లు పంపించారు? ఒకవేళ, నేను ఈ సదస్సుకు రాకపోతే, మహిళా సదస్సుల మీద ఇంట్రస్టు ఉన్నట్లు మాట్లాడుతుంది కానీ, రాలేదని బురదజల్లేందుకు కాదా? మహిళల సమస్యలపై చిత్తశుద్ధి ఉంది కాబట్టే, తెలుగుదేశం పార్టీ మహానాడులా జరుగుతున్న మీ మీటింగ్ కు రావాల్సి వచ్చిందే కానీ, అక్కడికి రావాల్సిన అవసరం మాకు ఏముంది? ఈ రోజు అక్కడికి వచ్చిన వాళ్లను మిమ్మల్ని పొగిడించుకునేందుకు పిలిపించుకున్నారే తప్పా, ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? ఎంత మంది మహిళలు బలై పోయారు? వాళ్ల కష్టాలు ఏంటని తెలిసిన వాళ్లను మీరు పిలిచారా? ఒక్క బాధితురాలిని అయినా ఈ సదస్సుకు పిలిచి మాట్లాడిస్తే, మీరు ఏర్పాటు చేసిన జాతీయ మహిళా సాధికారిక సదస్సుకు ఒక సార్ధకత ఉండేది.

ఒక వనజాక్షి, రిషితేశ్వరి తల్లిని, లావణ్య తల్లిని, గౌతమి చెల్లిని, జానీమూన్ ని కానీ, వాళ్ల ఇంట్లో వాళ్లను కానీ పిలిపించి డిస్కషన్ పెట్టుంటే మహిళలపై ఎలాంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయి? సాధికారత సాధించాలంటే ఏం చెయ్యాలి? అనే దానికి వాళ్లు కూడా సొల్యూషన్స్ ఇచ్చే వాళ్లు. అంతేకానీ, రాజకీయాలకు అతీతంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నామని చెప్పి వెబ్ సైట్ లో గొప్పగా పెట్టారే, మరి, ఈరోజు వెంకయ్యనాయుడు కూతురు, అలాగే, చంద్రబాబునాయుడు గారి కోడలు మాత్రమే గొప్ప వాళ్లా? వాళ్లు మాట్లాడేవి మాత్రమే మీరు టెలికాస్ట్ చేస్తారా? కోడెల శివప్రసాద్ గారి కోడలు చెప్పింది మీరు టెలీకాస్ట్ చేయరా? అంటే, అసెంబ్లీలో గానీ, సదస్సులో గానీ, వాళ్లకు వ్యతిరేకంగా ఎవరినీ మాట్లాడనీయమని చెప్పే పద్ధతిలో అహంకార పూరితంగా వ్యవహరిస్తుంటే, దానికి డీజీపీ గారు కూడా వంత పాడటం చాలా బాధాకరంగా ఉంది.

మొన్న ప్రెస్ మీట్ లో కూడా చెప్పాను. ఐఏఎస్ లు, ఐపీఎస్ లు వాళ్లకు ఉన్న రూల్స్ ప్రకారం పని చేయకుండా.. చంద్రబాబు నాయుడి గారి మాటే శాసనం, మాటే చట్టంలా ప్రవర్తిస్తున్నారు కాబట్టే, చంద్రబాబు నాయుడు నివసిస్తున్న విజయవాడలో అరాచకాలు, అఘాయిత్యాలు, జరుగుతున్నాయి. అంటే, దానికి చంద్రబాబు నాయుడి అండ ఉన్నట్లా? లేదా? ఈ పోలీసులు నిద్రపోతున్నట్లా? కాదా?....... ’ అని రోజా ఘాటుగా విమర్శించారు.

More Telugu News