: తమిళనాడు సీఎం ఎవరు? అనే విషయాన్ని బీజేపీ నిర్ణయించలేదు: వెంకయ్యనాయుడు

తమిళనాడు రాజకీయాల్లో బీజేపీ జోక్యం చేసుకోదని కేంద్ర మంత్రి, ఆ పార్టీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు మరోసారి స్పష్టం చేశారు. తమిళనాడులో ఎవరు సీఎం? అనే విషయాన్ని తమ పార్టీ నిర్ణయించలేదని, ఆ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు చూస్తుంటే బాధాకరంగా ఉందని, ఎవరు సీఎం అనే విషయాన్ని వారే తేల్చుకోవాలని ఆయన సూచించారు.

ఈ సందర్భంగా ఎస్సీ వర్గీకరణ, తెలంగాణ సీఎం కేసీఆర్ కు ప్రధాని మోదీ అపాయింట్ మెంట్ లభించక పోవడం, కాంగ్రెస్ పార్టీ తీరు వంటి విషయాలను ఆయన ప్రస్తావించారు. ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని, ఎన్నికల కారణంగా కేసీఆర్ కు ప్రధాని అపాయింట్ మెంట్ ఇవ్వకపోయివుండొచ్చని అన్నారు. ప్రధానిని గతంలో కేసీఆర్ కలిశారని, భవిష్యత్ లో కూడా కలుస్తారని అన్నారు. ప్రధాని మోదీకి వస్తోన్న ఆదరణను చూసి కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేకపోతోందని, ఎన్నో తప్పులు చేసిన కాంగ్రెస్ పార్టీ తమకు ప్రవచనాలు చెప్పడమేంటని వెంకయ్యనాయుడు ప్రశ్నించారు.

More Telugu News