: ఇరాక్‌, పాకిస్థాన్‌లలో కంటే మ‌న దేశంలోనే ఎక్కువ‌గా పేలుతున్న బాంబులు!

ఇరాక్‌, పాకిస్థాన్‌ లలో ఉగ్రవాదులు ఎప్పుడు విరుచుకుపడతారో.. ఎక్కడ బాంబులు పేలుస్తారో ఎవరికీ తెలియదు. అయితే, అలాంటి దేశాల కన్నా మ‌న దేశంలోనే అధికంగా బాంబులు పేలుతున్నాయ‌ట‌. ప్ర‌పంచంలో అధికంగా బాంబులు పేలుతున్న దేశాల జాబితాను ఎన్‌బీడీసీ(నేషనల్‌ బాంబ్‌ డేటా సెంటర్‌) విడుద‌ల చేసింది. అందులో భార‌త్ మొద‌టి స్థానంలో నిలిచింది. ఎన్‌బీడీసీ విడుదల చేసే పత్రిక 'బాంబ్‌షెల్'లో 2016లో 337 ఐఈడీ పేలుళ్లతో భారత్ ఈ స్థానంలో నిలిచింది. కాగా ఇరాక్‌, పాకిస్థాన్‌లు వ‌రుస‌గా ఆ త‌ర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

ఇక‌ అఫ్గానిస్థాన్‌, టర్కీ, థాయ్‌లాండ్‌, సొమాలియా, సిరియా  వ‌రుస‌గా నాలుగు, ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది స్థానాల్లో ఉన్నాయి.  అత్యంత ప్రమాదకరమైన పేలుడు ఘట‌న జ‌రిగిన రాష్ట్రంగా బిహార్ నిలిచింది. మావోయిస్టులు జరిపిన ఈ దాడిలో సీఆర్‌పీఎఫ్‌ కోబ్రా బెటాలియన్‌కి చెందిన 10 మంది కమాండోలు మృతి చెందారు. అనంత‌రం జమ్ముకశ్మీర్‌లో 9 మంది పోలీసులు, జార్ఖండ్ ‌లో ఏడుగురు, ఛత్తీస్‌గఢ్‌లో ఏడుగురు, మణిపూర్‌లో ఆరుగురు, అస్సాంలో ముగ్గురు ఈ ఘ‌ట‌న‌ల్లో మృతి చెందారు.

గ‌త రెండేళ్ల‌లో భార‌త్‌లో రాష్ట్రాల‌ వారీగా చూస్తే పేలిన బాంబుల సంఖ్య ఈ విధంగా ఉంది...

 ఛత్తీస్‌గఢ్‌లో పేలిన బాంబులు-60
 మణిపూర్‌లో-40
 కేరళలో-33
 తమిళనాడులో- 32
 జమ్ము కశ్మీర్‌లో- 31
 పశ్చిమ బెంగాల్‌లో- 30.

More Telugu News