: అరుదైన ఘనతను సొంతం చేసుకున్న హషీమ్ ఆమ్లా

దక్షిణాఫ్రికా స్టార్ బ్యాట్స్ మెన్ హషీమ్ ఆమ్లా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. నిన్న శ్రీలంకతో జరిగిన డే అండ్ నైట్ వన్డే మ్యాచ్ లో సెంచరీ సాధించిన ఆమ్లా... వన్డే కెరీర్ లో 24వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో వన్డేల్లో దక్షిణాఫ్రికా తరపున అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్ మెన్ గా ఏబీ డివిలియర్స్ తో పాటు సంయుక్తంగా నిలిచాడు. మరోవైపు టెస్టుల్లో ఇప్పటి వరకు 26 సెంచరీలను ఆమ్లా సాధించాడు. ఈ నేపథ్యంలో, అంతర్జాతీయ కెరీర్ లో 50 సెంచరీలను నమోదుచేసి, ఆటగాళ్ల ఎలైట్ క్లబ్ లో ఆమ్లా చేరాడు. ఈ జాబితాలో భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ (100) తొలి స్థానంలో ఉన్నాడు. రెండో స్థానంలో ఆస్ట్రేలియాకు చెందిన మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ (71) ఉండగా... తర్వాతి స్థానాల్లో శ్రీలంక మాజీ కెప్టెన్ సంగక్కర (63), దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ కలిస్ (62), శ్రీలంక మాజీ కెప్టెన్ జయవర్దనే (54), వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా (53)లు ఉన్నారు.

More Telugu News