: ఉప్పల్ టెస్టు: రెండవ రోజు ముగిసిన ఆట.. భారీ లక్ష్యఛేదనలో ఆదిలోనే బంగ్లాకి దెబ్బ

భార‌త్‌, బంగ్లాదేశ్ క్రికెట్ టీమ్‌ల మ‌ధ్య హైద‌రాబాద్ ఉప్ప‌ల్‌లోని రాజీవ్‌గాంధీ ఇంట‌ర్నేష‌నల్ స్టేడియంలో జ‌రుగుతున్న టెస్టు మ్యాచులో రెండ‌వ రోజు ఆట ముగిసింది. టీమిండియా బంగ్లాదేశ్‌కి ఇచ్చిన 687 ప‌రుగుల భారీ ల‌క్ష్య‌ఛేద‌న‌లో బంగ్లా బ్యాట్స్‌మెన్ త‌డ‌బ‌డ్డారు. ఆదిలోనే బంగ్లాదేశ్‌ తొలివికెట్ కోల్పోయింది. 15 ప‌రుగుల వ్య‌క్తిగ‌త స్కోరు వ‌ద్ద టీమిండియా బౌల‌ర్ అశ్విన్ బౌలింగ్‌లో బంగ్లా బ్యాట్స్‌మెన్ సౌమ్య వెనుదిరిగాడు. క్రీజులో టానిమ్ 24, మోమిన‌ల్ 1 పరుగుల‌తో ఉన్నారు. ఈ రోజు ఆట ముగిసేస‌రికి బంగ్లాదేశ్ స్కోరు వికెట్ న‌ష్టానికి 41 గా ఉంది.

టీమిండియా బ్యాట్స్‌మెన్‌లో రాహుల్ 2, జ‌డేజా 108, పుజారా 83, విరాట్ కోహ్లీ 204, ర‌హానే 82, అశ్విన్ 34, సాహా 106 (నాటౌట్‌) జ‌డేజా 60 (నాటౌట్‌) చేశారు. ఎక్స్ ట్రాల రూపంలో టీమిండియాకి 8 ప‌రుగులు వ‌చ్చాయి.

More Telugu News