: ప్రపంచ రికార్డును బద్దలు కొట్టిన కోహ్లీ.. బ్రాడ్ మన్, ద్రావిడ్ ల రికార్డు కనుమరుగు

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ కు రికార్డులన్నీ వరుసగా తల వంచుతున్నాయి. బంగ్లాదేశ్ తో హైదరాబాద్ లో జరుగుతున్న టెస్టులో కోహ్లీ మరో ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. వరుసగా నాలు టెస్ట్ సిరీస్ లలో నాలుగు డబుల్ సెంచరీలు సాధించిన తొలి బ్యాట్స్ మెన్ గా విరాట్ అవతరించాడు. ఈ క్రమంలో ప్రపంచ క్రికెట్ దిగ్గజాలు డాన్ బ్రాడ్ మన్, రాహుల్ ద్రవిడ్ లను కోహ్లీ వెనక్కి నెట్టేశాడు. వీరిద్దరూ మూడు వరుస సిరీస్ లలో మూడు డబుల్ సెంచరీలు నమోదు చేశారు. నేటి ఆటతో వీరి పేరిట ఉన్న రికార్డును కోహ్లీ చెరిపేశాడు.

మరోవైపు, 204 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కోహ్లీ ఔట్ అయ్యాడు. తైజుల్ ఇస్లాం బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం అశ్విన్ (4), సాహా (13)లు క్రీజులో ఉన్నారు. భారత స్కోరు ఐదు వికెట్ల నష్టానికి 503 పరుగులు. 

More Telugu News