: మహిళల ప్రాధాన్యతను గుర్తించింది ఎన్టీఆరే.. ఆ ఘనత ఆయనదే: చంద్రబాబు

మహిళలను గౌరవించినప్పుడే ఏ సమాజమైనా ప్రగతిపథంలో పయనిస్తుందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మహిళలకు పురుషులతో సమానంగా హక్కులను కల్పించేందుకు తమ నాయకుడు ఎన్టీఆర్ ఎంతో కృషి చేశారని, చట్టం వచ్చేలా చేశారని తెలిపారు. మహిళల విద్యకు ఉన్న ప్రాధాన్యతను గుర్తించింది ఎన్టీఆరే అని చెప్పారు. స్థానిక సంస్థల్లో మహిళలకు అవకాశాలు ఎన్టీఆరే కల్పించారని కొనియాడారు.

మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కావాలని కోరిన మొట్టమొదటి పార్టీ తెలుగుదేశమేనని చెప్పారు. మహిళా రిజర్వేషన్లను సాధించేంత వరకు తమ పోరాటం ఆగదని ఆయన తెలిపారు. మహిళా సాధికారత సాధించేంత వరకు తాను విశ్రమించనని చెప్పారు. మహిళలకు విద్య, ఉద్యోగాల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించామని తెలిపారు. అమరావతిలో జరుగుతున్న జాతీయ మహిళా పార్లమెంటేరియన్ల సదస్సులో ప్రసంగిస్తూ ఆయన ఈ విధంగా స్పందించారు.

సాధికారతే కాకుండా, ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా మహిళలు అడుగు వేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. డ్వాక్రా మహిళలు సమాజానికి నాయకత్వం మహించేలా ఎదుగుతున్నారని కితాబిచ్చారు. జూన్ నాటికి వంద శాతం గ్యాస్ కనెక్షన్లను పూర్తి చేస్తామని చెప్పారు. ఆర్టీసీ డ్రైవర్లుగా మహిళలకు అవకాశం కల్పించే దిశగా ఆలోచిస్తున్నామని తెలిపారు.

More Telugu News