: గవర్నర్ ను బొమ్మను చేసి ఆడించడం మంచి పద్ధతి కాదు: కాంగ్రెస్ నేత సూర్జేవాలా

తమిళనాడులో రాజకీయ అనిశ్చితి నెలకొన్న సమయంలో గవర్నర్ ను బొమ్మను చేసి ఆడించడం మంచి పద్ధతి కాదని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణ్ దీప్ సూర్జేవాలా మండిపడ్డారు. ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్ లోని రాజకీయాల్లో అనిశ్చితి ఏర్పడిన సమయంలో కూడా బీజేపీ ఇలానే వ్యవహరించిందని, ప్రస్తుతం తమిళనాడు విషయంలో కూడా ఇదే విధంగా కేంద్రం వ్యవహరిస్తోందని విమర్శించారు.

తమిళనాడులో నెలకొన్న తాజా పరిస్థితులను సొమ్ము చేసుకునేందుకు కేంద్రం యత్నిస్తోందని అన్నారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో నెలకొన్న రాజకీయ అనిశ్చితిని తమకు అనుకూలంగా మార్చుకోవాలని , ఆయా రాష్ట్రాల గవర్నర్లను బొమ్మలను చేసి ఆడించాలని చూడటం మోదీ ప్రభుత్వానికి అంత మంచిది కాదని, ఈ తరహా పద్ధతుల వల్ల ప్రజాస్వామ్య వ్యవస్థకు నష్టం వాటిల్లుతుందని అన్నారు. 

More Telugu News