: పాదసేవ చేసే సంప్రదాయం మాది కాదు: ప్రధాని మోదీ

కాంగ్రెస్ పార్టీపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి విమర్శల వర్షం కురిపించారు. తమది పాదసేవ చేసే సంప్రదాయం కాదని అన్నారు. పాద సేవ చేసే కుటుంబం నుంచి తాము రాలేదని అన్నారు. భారత స్వాతంత్ర్యోద్యమం కాంగ్రెస్‌ పుట్టకముందే పుట్టిందని, ఆ పోరాటంలో కులం, మతంతో సంబంధం లేకుండా ఎంతో మంది త‌మ‌ ప్రాణాలను త్యాగం చేశారని ఆయ‌న అన్నారు. అందులో వీరసావర్కర్‌ లాంటి వారు కూడా ఎందరో ఉన్నారని, మ‌రోవైపు ఆ గొప్ప‌ద‌నాన్ని కొంద‌రు ఒక్క కుటుంబానికే కట్టబెడుతున్నార‌ని ఆయ‌న విమ‌ర్శించారు.

ఆప్‌ ఎంపీ భగవత మన్‌ని ప్రధాని నరేంద్ర మోదీ విమ‌ర్శించారు. ఇటీవల పంజాబ్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయ‌న మద్యం తాగుతుండ‌గా తీసిన ఫొటోలు, వీడియోలు వైర‌ల్ అయిన విష‌యం తెలిసిందే. ఆ విష‌యాన్ని గురించి గుర్తుచేస్తూ తాను ప్రజలను నెయ్యి తాగమని కోరానని, భ‌గ‌వ‌త్‌ మన్‌ మాత్రం ఇంకేదో తాగాలని చెబుతున్నారని చుర‌క‌లు అంటించారు.

More Telugu News