: అమెరికా కొత్త కిరికిరి... అడిగిన పాస్ వర్డ్ లన్నీ చెబితేనే వీసా!

ఎలాగైనా ముస్లింలను తమ దేశంలోకి అడుగుపెట్టకుండా చూడాలన్న ఉద్దేశంతో ఉన్న అమెరికా ప్రభుత్వం కొత్త కిరికిరి తెచ్చింది. కోర్టు ఆదేశాలతో ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆదేశాలు పక్కకు నెట్టబడిన నేపథ్యంలో, నిషేధం విధించిన దేశాల వారు రాకుండా అడ్డుకోవడం కష్టమేనని అమెరికా అంతర్గత రక్షణ వ్యవహారాల కార్యదర్శి జాన్‌ కెల్లీ అంగీకరించారు. ఇదే సమయంలో అమెరికాకు వచ్చే వారి అన్ని రకాల ఖాతాల పాస్ వర్డ్ లను అడుగుతామని అవి చెబితేనే వాటిని పూర్తిగా పరిశీలించిన తరువాత వీసాకు అనుమతి ఇస్తామని ఆయన స్పష్టం చేశారు.

సోషల్ మీడియా ఖాతాలు, మెయిల్స్ పాస్ వర్డ్ ల వల్ల వారు ఎలాంటి సైట్స్ చూస్తున్నారన్న విషయంతో పాటు, వారి బ్యాంకు ఖాతాల్లో అనుమానాస్పద లావాదేవీలు తదితరాలను తెలుసుకోవచ్చని కెల్లీ అభిప్రాయపడ్డారు. యూఎస్ లో కాలు మోపాలనుకునే వారు, అధికారులు అడిగితే, తప్పనిసరిగా పాస్ట్ వర్డ్ లు చెప్పాల్సి వుంటుందని, అలా చెప్పడం ఇష్టం లేకుంటే, అసలు ఇక్కడికి రానే రావద్దని ఆయన చెప్పారు.

More Telugu News