: ఇంకా బ్లాక్ మనీ ఉందా? ఎన్నిసార్లయినా డిపాజిట్ కు చాన్స్... మార్చి 31 వరకే!

గత సంవత్సరం డిసెంబర్ 16న మోదీ సర్కారు ప్రకటించిన 'ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ డిపాజిట్ స్కీమ్-2016'లో భాగంగా నల్లధనాన్ని దాచుకున్న వారు ఎన్నిసార్లయినా దాన్ని బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవచ్చని ప్రకటించింది. ఇప్పటివరకూ లెక్కలో చూపని ఆదాయాన్ని ఒకే దఫాలో, లేదా అంతకన్నా ఎక్కువసార్లుగా బ్యాంకుల్లో వేసుకోవచ్చని తెలిపింది. ఈ పథకంలో భాగంగా లెక్క చూపని ఆదాయంలో 50 శాతాన్ని పన్నుగా చెల్లించాల్సి వుంటుందన్న సంగతి తెలిసిందే. మరో 25 శాతం మొత్తాన్ని ఎలాంటి వడ్డీ లేకుండా బ్యాంకుల్లో నాలుగు సంవత్సరాల పాటు ఉంచాలి. మిగిలిన 25 శాతం మొత్తం ఎక్కడిదన్న ప్రశ్నలు, వేధింపులూ ఉండవు. దీన్ని పన్ను చెల్లించిన ఆదాయంగానే ప్రభుత్వం పరిగణిస్తుంది. 50 శాతం జరిమానా చెల్లించిన తరువాత, 25 శాతం మొత్తాన్ని ఒకేసారి డిపాజిట్ చేయాలన్న నిబంధన ఇప్పటివరకూ ఉండగా, దాన్ని సవరిస్తూ, దఫదఫాలుగా చేసే డిపాజిట్లనూ  'ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ డిపాజిట్ స్కీమ్-2016' కింద పరిగణిస్తామని ప్రభుత్వం కీలక సవరణ చేసింది.

More Telugu News